Thursday, May 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅవినీతి అక్రమాలపై విచారణ జరిపించండి..

అవినీతి అక్రమాలపై విచారణ జరిపించండి..

సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్

ధర్మవరంలో రూ. 60 కోట్ల విలువైన 650-2 సర్వే నంబర్ జరిగిన అవినీతిపై విచారణ జరిపించండి అని కోరుతూ ఆర్డీవో మహేష్ కు వినతి పత్రం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 60 కోట్లు విలువచేసే సర్వేనెంబర్ 650-2 పై భారీ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించండి అని కోరుతూ ఆర్డీవో మహేష్ కువినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి ముసుగు మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ.పట్టణంలో బెంగళూరు వెళ్లే రోడ్డు నందు గల 650-2 సర్వే నంబర్ లో 60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పేదల పేర్లు చెప్పుకొని ప్లంబర్స్ యూనియన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుమ్మక్కై ఆ ప్రభుత్వ భూమిని అర్హులైన ప్లంబర్ల కు అందకుండా తమ బినామీ పేర్లతో ఆ భూమిని అంతా నొక్కేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.వీరికి అప్పటి తాసిల్దార్ రమేష్ అవినీతి అక్రమార్కులకు పూర్తిగా సహకరించారు అని తెలిపారు.1996 లో ప్లంబర్స్ అంతా ఒక యూనియన్ గా ఏర్పాటు చేసుకొని పట్టాల కోసం ప్రభుత్వాన్ని విన్నవించుకోగా వారికి మంజూరు చేసింది అని తెలిపారు.అయితే సదరు భూమి మాది అంటూ పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో అప్పటినుంచి అది పెండింగ్లో పెట్టడం జరిగిందన్నారు గత వైసిపి ప్రభుత్వంలో భూమి యజమానులు ప్లంబర్స్ యూనియన్ రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది అని తెలిపారు.దీన్ని ఆసరాగా చేసుకున్న ప్లంబర్స్ యూనియన్ ముసుగులో అప్పటి అధికార పార్టీని అడ్డుపెట్టుకొని భూమి యజమానులను బెదిరించి మరోవైపు అసలైన ప్లంబర్స్ ని కూడా తొక్కి పెట్టేసి యూనియన్ పేరు చెప్పుకొని ముగ్గురు వ్యక్తులు దాదాపు 30 నుంచి 35 పట్టాలు తమ బినామీ పేర్లతో దోచేశారు అని మండిపడ్డారు.పట్టాలు ఇచ్చినందుకు అప్పటి ఎమ్మార్వో రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ కూడా 21,24,66 నెంబర్ గల పట్టాలు బినామీ పేర్లతో కేటాయించి వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును సదరు తాసిల్దార్, అప్పటి కమిషనర్ కు నజరానాగా ఇచ్చినట్లు సమాచారం అని తెలిపారు. కావున 60 కోట్ల విలువైన 2 ఎకరాల భూమి కేవలం యూనియన్ లోనీ ముగ్గురు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది అని తెలిపారు. ఆ ముగ్గురిలో డి. రాజు, డి సురేంద్రలు అన్నదమ్ములు ఉన్నారని తెలిపారు.మరో వ్యక్తి ఎన్. లతీఫ్ కూడా ఉన్నారని తెలిపారు. రూ. 60 కోట్ల విలువ చేసే 2 ఎకరాల భూమిని యూనియన్ ముసుగులో తల్లి, తండ్రి, సోదరి, తోడల్లుడు, కూతురు, మరదలు, మేనల్లుడు, సోదరుడు, అత్త, స్నేహితుల పేర్లు పెట్టీ నిండా దోచేసారాన్నారు. వీరిపై చట్టబద్దంగా విచారించి అసలైన అర్హులకు విలువైన పట్టాలు అందేలా చర్యలు తీసుకొనీ సదరు వ్యక్తులపై 420 కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం నాయకులు ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు,తాజుద్దీన్, రామకృష్ణ,రామసుబ్బయ్య,సురేంద్ర,నాగేంద్ర, చిన్న, జనార్దన్, మహిళా సమైక్య నాయకులు లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు