Homeఅంతర్జాతీయంఅమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ దాడి

అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ దాడి

- Advertisement -

ఎఫ్15, ఏ10 ఫైటర్ జెట్‌లు ధ్వంసం

తెహ్రాన్: యుద్ధం వేళ అమెరికాకు ఇరాన్ సామర్ధ్యం అంతు బట్టడం లేదు. అంతా అయిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎక్కడా తగ్గేది లేదని ఇరాన్ తన పని తాను చేసుకుపోతోంది. అమెరికా దాడులను తిప్పి కొడుతూ ధీటైన సమాధానం చెబుతోంది. అమెరికాకు షాక్‌లు మీద షాక్‌లు ఇస్తోంది. ఒకే రోజు అగ్రరాజ్యానికి చెందిన రెండు యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. మరో రెండు హెలికాప్టర్ల పైనా దాడి చేసింది. ఈ ఘటనల్లో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడగా.. మరో పైలట్ గల్లంతయ్యారు. అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ విమానాన్ని ఇరాన్ శుక్రవారం దాడి చేసి కూల్చేసింది. ఇందులో ఓ పైలట్, వెపన్ సిస్టమ్ అధికారి ఉన్నారు. వీరిలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. హోర్మూజ్ సమీపంలో ఏ-10 వార్‌థగ్ ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చేసింది. దీని శకలాలు కువైట్‌లో పడగా… అందులోని పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ రెండు ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరిగినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతోన్న వేళ… ఈ ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. అగ్రరాజ్యం అంచనాలకు మించి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దాడి నుంచి బయటపడిన హెలికాప్టర్లు…అమెరికా
మొదటి యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్ కోసం రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు గాలింపు చేపట్టాయి. వీటిపైనా ఇరాన్ దాడి చేసినట్లు అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇవి దాడి నుంచి త్రుటిలో తప్పించుకొని ఇరాన్ గగనతలం నుంచి బయట పడినట్లు పేర్కొన్నాయి. ఈ ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సమాచారం ఇచ్చినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. ఏ-10 యుద్ధ విమానం కూలిన దృశ్యాలను ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు