Homeఅంతర్జాతీయంపాక్‌లో ఇరాన్ సైనిక విమానాలు!

పాక్‌లో ఇరాన్ సైనిక విమానాలు!

- Advertisement -

అమెరికా మీడియాలో కథనాలు

వాషింగ్టన్: ఇరాన్ సైనిక విమానాల విషయంలో ఓ ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ గురించి తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో ఇరాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో ఉంచేందుకు పాక్ రహస్యంగా అనుమతించిందట. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ కథనాల ప్రకారం… ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లో నిలిపిఉంచినట్లు వెల్లడించాయి. లాక్‌హీడ్ సి-130 హెర్క్యులస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్‌సీ-130తో సహా పలు విమానాలు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక, సైనిక ఆస్తులను రక్షించుకోవడంలో భాగంగా ఇరాన్ ఇలా చేసి ఉండవచ్చని ఆ కథనాలు పేర్కొన్నాయి. దీంతో పాటు తెÉహ్రాన్‌కు చెందిన ఓ పౌర విమానాన్ని కూడా అఫ్గానిస్థాన్‌లో నిలిపిఉంచినట్లు వెల్లడించాయి.
అదేం లేదు…పాక్ సైనికాధికారి
పాకిస్థాన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ కథనాలను ఖండించారు. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ ప్రజలు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతంలో ఉందన్నారు. కాబట్టి ఇలాంటి కార్యకలాపాలు అక్కడ రహస్యంగా జరగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఘర్షణ ప్రారంభం కావడానికి ముందు మహాన్ ఎయిర్‌కు చెందిన ఒక ఇరాన్ పౌర విమానం కాబుల్‌లో దిగిందని అఫ్గాన్ పౌర విమానయాన అధికారి తెలిపారు. ఘర్షణల కారణంగా ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో… అది అక్కడే ఉండిపోయిందన్నారు. అఫ్గాన్‌లో ఇరాన్ విమానాలు ఉన్నాయనే వార్తలను…తాలిబన్ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తోసిపుచ్చారు. విమానాలను తరలించాల్సిన అవసరం ఇరాన్‌కు లేదన్నారు. కాగా… యూఎస్ సెనెటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా దీనిపై స్పందించారు. ఒకవేళ ఇదే నిజమైతే…యుద్ధం ముగింపు విషయంలో మధ్యవర్తిగా పాక్ పాత్రను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా`ఇరాన్ మధ్య తెలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాలో అనేక పుకార్లు, అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా దేనినీ నమ్మలేని పరిస్థితిలో ఉందనడానికి ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు