Thursday, January 9, 2025
Homeఆంధ్రప్రదేశ్ముగిసిన శ్రీవారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టికెట్ల జారీ

ముగిసిన శ్రీవారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టికెట్ల జారీ

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ మొత్తానికి పూర్తయ్యింది. నిన్న సాయంత్రం ప్రారంభమైన ఈ ప్రక్రియ గురువారం ఉదయం 10.30 గంటలకు వరకు కొనసాగింది. అయితే, టోకెన్ల జారీ ప్రక్రియ సందర్భంగా బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తొక్కిసలాట అనంతరం టీటీడీ అధికారులు, పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది టోకెన్ల జారీ ప్రక్రియను మరల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కొనసాగకుండా నిర్వహించారు. గురువారం ఉదయం కోటా పూర్తవడంతో కౌంటర్లను మూసేసినట్లు టీటీడీ పేర్కొంది. మొత్తం 3 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు 1లక్షా 20 వేల టోకెన్లు జారీ చేయగా.. రోజుకు 40 వేల చొప్పున జారీ చేసినట్లు టీటీడీ వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు