Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిభారతదేశానికి విశేష సేవలు అందించడం గర్వించదగ్గ విషయం..

భారతదేశానికి విశేష సేవలు అందించడం గర్వించదగ్గ విషయం..

ఆదర్శ సేవా సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం;; సాంకేతిక వైఫల్యాలను జయిస్తూ అంతరిక్షం నుండి భూమికి దిగివచ్చిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ సేవలు అనన్యమైనవని ఆదర్శ సేవా సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, గౌరవాధ్యక్షులు చెన్నం సూర్య ప్రకాష్, కార్యదర్శి గుద్దుటి నాగార్జున, సభ్యులు నాగభూషణ, మారుతి, సూర్య ,నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆదర్శ పార్కులో సునీత విలియమ్స్ భూమికి చేరడంలో వారి కృషికి అభినందన తెలుపుతూ వారి సేవలను కొనియాడారు. అనంతరం వారు మాట్లాడుతూ 9 నెలలుగా అంతరిక్షంలో ధైర్యంగా ఉంటూ తిరిగి భూమికి చేరడం గర్వకారణం అని తెలిపారు. మహిళలు ఒంటరిగా అన్న వాటిని వదిలి సునీత విలియమ్స్ ను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో, కుటుంబంలో ముందడుగు వేయాలని తెలిపారు. 9 నెలలుగా కుటుంబానికి దేశానికి దూరంగా ఉంటూ తాను అనుకున్న లక్ష్యాన్ని చేదించడంలో ఉన్నటువంటి దైర్య సాహసం మరుపు రానిదని తెలిపారు. మనో నిబ్బరం, సాహసము, ధైర్యం ఉన్న సునీత విలియమ్స్ చేసిన దాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళలు మరింత అభివృద్ధి పథములో నడవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు