కేహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కె హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు ఎస్ వి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దూరవిద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షల్లో ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య కోఆర్డినేటర్లు నాకు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినట్లు నిందలు మోపడం సరికాదని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బుధవారం కొంతమంది విద్యార్థుల సంఘం నాయకులు మా కళాశాలకు రావడం జరిగిందని, ఎస్వీ యూనివర్సిటీ కోఆర్డినేటర్లు మా కళాశాల కు లంచం ఇచ్చినట్టు చెప్పడం పద్ధతి కాదని వారు తెలిపారు. మా కళాశాలలో ఏ పరీక్షలు జరిగినా కూడా నియమ నిబంధనలు ప్రకారమే తప్పక జరుగుతుందని వారు స్పష్టం చేశారు. దూరవిద్య పరీక్షలు రాసే విద్యార్థుల వద్ద డీల్ కుదిరినట్లు తెలపడం అవాస్తవాలని తెలిపారు. మా కళాశాలలో డబ్బులు ఇచ్చి పరీక్షలు రాయించడం అనేది జరగదని వారు తెలిపారు. ఇలాంటి వాటికి తాను అవకాశం ఇవ్వనని తెలిపారు.
ఎస్వీ యూనివర్సిటీ దూర విద్యా పరీక్షల లో నాపై నింద మోపడం సమంజసం కాదు
RELATED ARTICLES