ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతులను పరామర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ
విశాలాంధ్ర -అనంతపురం : నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు సరైనది కాదు అని నష్టపోయిన ఉద్యాన పంట రైతులకు మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ పేర్కొన్నారు. ఎల్లనూరు మండలంలోని నీర్జా పల్లి గ్రామానికి చెందిన రైతులు గొంగి లక్ష్మీనారాయణ, అంకె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా వారిని సోమవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…యల్లనూరు మండలంలోని నీర్జాంపల్లికి చెందిన రైతులు లక్ష్మీనారాయణ, చిన్నవెంగప్ప అరటి సాగు చేశారన్నారు . 18 లక్షలు పెట్టుబడిపెట్టి లక్ష్మీనారాయణ 12 ఎకరాల్లో, 13 లక్షలు పెట్టుబడిపెట్టి చిన్నవెంగప్ప 9 ఎకరాల్లో సాగు చేశారన్నారు . పంట నేలరాలడంతో దిగులుచెందిన వారు ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. గాలి ఎక్కువ అవ్వడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. లక్షలాది పెట్టుబడి పెట్టి పంట వస్తుందన్న తరుణంలో తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. ఉద్యాన పంటలో నష్టపోయిన వారికి వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి వారికి ధైర్యం చెప్పి నష్టపరిహారం అందించాలన్నారు. తద్వారా కొంతైనా వారు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా రైతులు తమ సమస్యల పట్ల పోరాటం చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకింత కూడా స్పందించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల మాట్లాడడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులంటేనే ఖతర్ చేయడం లేదన్నారు. రాష్ట్ర వ్యవసాయక మంత్రి అచ్చం నాయుడు తక్షణమే కల వర్షం వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించాలని సిపిఐ పార్టీ, రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. నష్టపోయినప్పుడల్లా ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి సమస్య పరిష్కరించేంతవరకు రైతులకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తో పాటు సిపిఐ అనంత జిల్లా కార్యదర్శి సి జాఫర్, సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్యా యాదవ్, సిపిఐ జిల్లా కార్యదర్శి సహాయ సహాయ పి. నారాయణస్వామి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి,ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాటమయ్య ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ సింగనమల నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి టి నారాయణస్వామి కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు రాము సిపిఐ అనంతపురం నగర సహాయ కార్యదర్శి రమణయ్య వీకే కృష్ణుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.