Monday, May 12, 2025
Homeజాతీయంభారత్ దాడుల్లో మా యుద్ధ విమానం ధ్వంసం కావడం నిజమే.. పాక్ అంగీకారం

భారత్ దాడుల్లో మా యుద్ధ విమానం ధ్వంసం కావడం నిజమే.. పాక్ అంగీకారం

ాఆపరేషన్ సిందూర్్ణ పేరుతో భారత్‌ నిర్వహించిన దాడుల్లో తమ యుద్ధ విమానం ఒకటి స్వల్పంగా ధ్వంసమైందని పాకిస్థాన్ సైన్యం అంగీకరించింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చివేసి, భారీ నష్టం కలిగించామని భారత సైనిక వర్గాలు గతంలో ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇస్లామాబాద్‌లో తమ దేశ వాయుసేన, నౌకాదళ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఁభారతదేశంతో చోటుచేసుకున్న సైనిక ఘర్షణల సమయంలో మన వాయుసేనకు చెందిన ఒక యుద్ధ విమానం స్వల్పస్థాయిలో ధ్వంసం కావడం నిజమేఁ అని ఆయన తెలిపారు. అయితే, ఆ విమానానికి వాటిల్లిన నష్టం ఏ స్థాయిలో ఉంది? దానికి సంబంధించిన ఇతర పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. కేవలం స్వల్ప నష్టంగానే ఆయన పేర్కొనడం గమనార్హం.

భారత సైన్యం ప్రకటన
ఆపరేషన్ సిందూర్్ణలో భారత సైన్యం సాధించిన విజయాలను ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఆదివారం మీడియాకు వివరించారు. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్ విమానాలను నేలకూల్చామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఎన్ని విమానాలను కూల్చివేశారన్న సంఖ్యను ఆయన వెల్లడించలేదు. మన దేశ సరిహద్దుల్లోకి పాకిస్థానీ యుద్ధ విమానాలు ప్రవేశించకుండా సమర్థవంతంగా అడ్డుకున్నాం. అందువల్ల వాటి శకలాలు మన వద్ద లేవు. అయినప్పటికీ, కచ్చితంగా కొన్ని శత్రు విమానాలను కూల్చివేశాం అని భారతి పేర్కొన్నారు. భారత సైనిక సామర్థ్యాన్ని తాము చాటిచెప్పామని, ఈ ఘర్షణల ప్రభావం రావల్పిండి వరకు చేరిందని భారత వర్గాలు పేర్కొన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు