విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో విశ్రాంతి ఉద్యోగుల దినోత్సవం (పెన్షనర్స్ డే) అధ్యక్షులు చలపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్న రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏటిఓ పద్మనాభం, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ సందీప్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు శంకరనారాయణ, ఐ సి ఐ సి ఐ బ్యాంక్ మేనేజర్ నిగోల్, కొత్తపేట ఆంధ్ర ప్రగతి బ్యాంకు మేనేజర్ సువర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ పదవి విరమణ తర్వాత మంచి ప్రశాంతతతో, మనశ్శాంతితో జీవించినప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. పెన్షన్ల యొక్క సమస్యలను పరిష్కరించుటలో ఐక్యమత్యంగా ఉన్నప్పుడే అన్ని సాధ్యపడుతాయని తెలిపారు. పెన్షనర్ల సమస్యలపై ప్రతినెల నిర్వహించే సమావేశంలో అందరూ తప్పక హాజరై, చర్చించాలని తెలిపారు. బ్యాంకు ద్వారా అవసరమయ్యే సేవలను తప్పక అందిస్తామని తెలిపారు. పెన్షన్ దారులకు ట్రెజరీ కార్యాలయంలో కావలసిన సహాయ సహకారాలను తప్పక అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ విషయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏమాత్రం పొరపాటు జరిగిన ధన నష్టం జరుగుతుందని తెలిపారు. మీ బ్యాంకు ఖాతా నెంబర్ కానీ, పాస్వర్డ్ గానీ, ఏటీఎం వివరాలు గానీ తెలపరాదని తెలిపారు. అనంతరం పదిమంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులైన పోతిరెడ్డి, గోవిందరెడ్డి, సరోజినీ, సదాశివరెడ్డి, కంబగిరి ,శివయ్య, నాగరాజు, శ్రీనివాసులు, యజ్జన్న, రామిరెడ్డి లను విశ్రాంతి ఉద్యోగుల సంఘం వారు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి నర్సిరెడ్డి, కోశాధికారి సుధాకర్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా జరిగిన ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్స్ డే. అధ్యక్షులు చలపతి
RELATED ARTICLES