Friday, February 21, 2025
Homeఆంధ్రప్రదేశ్రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్.. జైల్లో వంశీ సెల్ వద్ద భద్రత పెంపు

రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్.. జైల్లో వంశీ సెల్ వద్ద భద్రత పెంపు

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వంశీ అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. మరోవైపు, విజయవాడ జిల్లా కారాగారంలో ఉన్న వంశీని వైసీపీ అధినేత జగన్ రేపు కలవనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు రానున్నారు. విజయవాడ చేరుకున్న తర్వాత నేరుగా ఆయన జైలుకు వెళ్లి, ములాఖత్ లో వంశీని కలుస్తారు. మరోవైపు, జైల్లో వంశీని ఉంచిన సెల్ వద్ద భద్రతను పెంచారు. అదనంగా గార్డులను నియమించారు. తోటి ఖైదీలు అక్కడకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెల్ వద్ద అడ్డంగా ఒక వస్త్రాన్ని కట్టారు. జైల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి కేసుల నిందితులు ఉండటంతో… వారి నుంచి వంశీకి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు