వైయస్ జగన్ పాలనను కోరుకుంటున్న ప్రజలు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఎన్నికల్లో స్వప్రయోజనం కోసం ఎడాపెడా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై విసుగుచెందిన రాష్ట్ర ప్రజలందరూ జగన్ పరిపాలన కోసం ఎదురుచూస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువనేత వై. ప్రణయ్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి యువనేత ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ
చరిత్రలో ఎవరు చెయ్యని విధంగా సుపరిపాలన అందించిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రజలు జీవితాల్లో సమూల మార్పులకు నాంది పలికారని పేర్కొన్నారు. రాజకీయాల్లో వైయస్ జగన్ ప్రస్తావన ఒక చరిత్ర ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందరికో ఆదర్శప్రాయుడు అయ్యారని కొనియాడారు రాజకీయాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే విలువలకు వైయస్ జగన్ నిలువెత్తు నిదర్శనం అన్నారు.
జగన్ లేని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడిందన్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు వైయస్సార్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రడ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.