విశాలాంధ్ర ధర్మవరం:: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఆకుల రమేష్ తదితరులు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 14వ తేదీన పిఠాపురం చిత్రాడలో నిర్వహించడం జరుగుతుందని, హిందూపురం పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు లక్షలాదిగా తరలివచ్చి సభను దిగ్విజయం చేయాలని తెలిపారు. ఈ సభ కోసం బస్సులు జీపులు తదితరు వెహికల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కాకినాడలో ప్రత్యేకంగా కాపు కళ్యాణ మండపంలో వసతి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ ఇన్చార్జ్ సాకే పవన్ కుమార్, పెనుకొండ నాయకులు కుమార్, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్తా శ్రీనివాసులు,పట్టణ అధ్యక్షులు అడ్డగిరి శ్యాం కుమార్ ,మల్ల మీద మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ
RELATED ARTICLES