విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణ జనసేన నాయకుడు తొండ బాల రవి తన సమస్యను రెవెన్యూ అధికారులు పరిష్కరించకపోవడంతో ఆర్డీవో కార్యాలయ ఆవరణ ముందు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తొండమాల రవి మాట్లాడుతూ చెన్నై కొత్తపల్లి మండలం యాదిండి రెవెన్యూ పరిధిలో ఉన్న తన భూమికి సంబంధించిన వివరాలు వీఆర్వో చంద్ర ఫ్రీ ఓల్డ్ జాబితాలో నమోదు చేయలేదని వాపోయారు. పలుమార్లు అక్కడి ఎమ్మార్వోకు, సంబంధిత విఆర్ఓ కు తెలిపిన కూడా నిర్లక్ష్య ధోరణి చేశారని బాధను వ్యక్తం చేశారు. తాను ఫ్రీ ఓల్డ్ చేయడానికి లంచం ఇవ్వలేనని వారు స్పష్టం చేశారు.1978 లో చెన్నై కొత్తపల్లి మండలం యాదిండి పొలంలో నా తండ్రి వీరన్న పేరిటన 4.58 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. 2003కి ముందున్న భూములు 2023లో ఫ్రీ ఓల్డ్ అయ్యాయని తెలిపారు. మాభూమి కలెక్టర్ జాబితాలో సీరియల్ నెంబర్ 592లో పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఈ వివరాలను ఫ్రీ ఓల్డ్ లో చేయాలంటే వీఆర్వో చంద్రశేఖర్ తనకు లంచం ఇస్తే చేస్తానని తెలపడం జరిగిందన్నారు. లంచం ఇవ్వలేదని స్పష్టం చేసిన మనసులో పెట్టుకొని నన్ను సాధించడం ఎంతవరకు సమంజసమని వారు బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రీ సర్వే చేస్తున్నారని తెలిసి మళ్ళీ విఆర్ఓ ను అడిగితే పట్టించుకున్న పాపాన పోలేదని వారు తెలిపారు. అందుకే తాను ఆర్డిఓ మహేష్ కు తన సమస్యను తెలుపుకునేందుకు రావడం జరిగిందని తెలిపారు. వీఆర్వో చంద్రశేఖర్ బదిలీపై వెళ్లడంతో నా పని కావటం లేదని తెలిపారు. నావద్ద అన్ని రికార్డులు పక్కాగా ఉన్నా కూడా నా భూములను ఎందుకు ఫ్రీ ఓల్డ్ చేయడం లేదో నాకు అర్థం కావడం లేదని బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయంలోని ఏవో కతి జూన్ కుప్రా నిరసనను ఆపి, సమస్యను అడిగి తెలుసుకుని, విచారణ వెంటనే చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో తొండమాల రవి తన నిరసనను విరమించారు.
ఆర్డీవో కార్యాలయ ఆవరణలో జనసేన నాయకుడు నిరసన ధర్నా
RELATED ARTICLES