విశాలాంధ్ర – నెల్లిమర్ల : ఈ నెల 14 న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆ పార్టీ నెల్లిమర్ల నగర పంచాయతీ నాయకులు జానా ప్రసాద్, అప్పికొండ రవికుమార్, రవ్వా నాని పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో పార్టీ ఆవిర్భావ సభపై సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత జరుగుతున్న పార్టీ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. నెల్లిమర్ల నియోజక వర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆధ్వర్యంలో సభకు అధిక సంఖ్యలో బయలుదేరాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు నల్లి చంద్రశేఖర్, ఎంఎం నాయుడు, మజ్జి రాంబాబు, పలిశెట్టి దొరబాబు, బంగారు శంకరరావు, భానుప్రకాష్, వాసు, శంకర్, చిన్న, పళని, రవి, భాష, కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.