విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన బిజెపి నాయకులు లక్ష్మీనారాయణ శ్రీనివాసులు పై వైసీపీ గుండాల దాడిలో గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఘర్షణలో గాయపడిన ఇరువురిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ విధమైన దాడులు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, మున్ముందు ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు. బిజెపి నాయకులపై దాడి చేయడం సిగ్గుచేటు అని, ఏదైనా ఉంటే చట్ట ప్రకారం చేసుకోవాలే గాని ఇలా దాడులు చేయడం సమంజసం కాదు అని చెప్పారు. దాడి చేసిన వైఎస్ఆర్సిపి నాయకులను సంబంధిత పోలీసులు వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
RELATED ARTICLES