విశాలాంధ్ర – విజయనగరం జిల్లా – రాజాం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి, రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పొగిరి.సురేశ్ బాబు రాజాంలో బుధవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడాలని, హుందాతనంగా ప్రవర్తించాలి. విలువలు లేని నీ ప్రవర్తన పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించే అర్హత నీకు లేదని అన్నారు.దువ్వాడ శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోగిరి.సురేష్ బాబు అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.