జనసేన యూత్ నాయకులు అరిగెల భాస్కర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని జనసేన యూత్ నాయకులు అరిగెల భాస్కర్ స్వగృహంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్డులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పథకాలపై నేడు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారని, పార్టీ సిద్ధాంతాలు నచ్చడం వల్ల 500 మందికి జనసేన సభ్యత్వపు కార్డులను పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మున్ముందు మరిన్ని క్రియాశీలక సభ్యత్వం కార్డులను పంపిణీ చేయడంతో పాటు, జనసేన పార్టీ అభివృద్ధికి తాను పాటు పడతానని తెలిపారు.
జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్డులు పంపిణీ..
RELATED ARTICLES