ఏ ఐ టి యూ సి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్
విశాలాంధ్ర అనంతపురం : మీటర్ రీడర్స్ కు విద్యుత్ రంగంలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో మంగళవారం ఫిబ్రవరి 20 తేదీన విజయవాడలో జరుగు విద్యత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని గోడ పత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ మీటర్ రీడర్స్ ఎన్నో సంవత్సరాలుగా విద్యుత్ రంగంలో పనిచేస్తూ కాంట్రాక్టర్లతో దోపిడీకి గురవుతున్నారన్నారు. విద్యుత్ రంగంలో వచ్చిన స్మాట్ మీటర్స్ విధానంతో రీడర్స్ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. మీటర్ రీడర్స్ కు విద్యుత్ రంగంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మీటర్ రీడర్స్ సమస్యలపై దశలవారీగా ఆందోళన నిర్వహించడానికి ఫిబ్రవరి 20 న జరుగు మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,నగర అధ్యక్షులు చిరంజీవి,మీటర్ రీడర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్,అనంతపురం జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం,ప్రధాన కార్యదర్శి రాము,నాయకులు శాన్వాస్, సలీం,భాష తదితరులు పాల్గొన్నారు.