తొగట వీర క్షత్రియ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శివానగర్లో గల శివాలయ ఆవరణములో ఈనెల 4వ తేదీ శనివారం ఉదయం నిర్వహించబడే”చేనేత కులాల ఆత్మీయ బంధువు-కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్”ను సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తోకటవీర క్షత్రియ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిత 2025వ సంవత్సరపు శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు, చేనేత కార్మికులకు, చేనేత కులాల వారికి తెలిపారు. మన ధర్మవరంలో ఏడు చేనేత కులాల సోదర, సోదరీమణులు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో 70 శాతము చేనేత కులాలకు సంబంధించిన వారు ఉన్నారని తెలిపారు. నేడు కదిరిలో అత్యధికంగా మన చేనేత కుల బాంధవుడు కదిరిలో ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవడం ఎంతో శుభదాయకమని, అంతేకాకుండా కదిరి ప్రజల మన్ననలు పొందిన మహా వ్యక్తి అని తెలిపారు. అటువంటి వ్యక్తికి మన ధర్మవరం నియోజకవర్గ తరఫున ప్రేమ, అభిమానం, బాధ్యతగా గుర్తించి ఈ నెల 4వ తేదీన కందికుంట ప్రసాద్కు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఐక్యమత్యంతో చేనేత కులాలు ముందుకు వెళ్లినప్పుడే, భావితరాలకు మనం చేయూత ఇచ్చిన వాళ్ళము అవుతామని తెలిపారు. ఈ ఐక్యమత్యంతోనే మన చేనేత కులాల ఉనికిని చాటుగలుగుతామని తెలిపారు. ఐక్యమత్యంతో వేలాది సంఖ్యలో చేనేత కులాలకు చెందిన వారు ఈ సభకు హాజరైనప్పుడే, సభకు నాంది అవుతుందని తెలిపారు.”రండి-కదిలిరండి”అన్న నినాదంతో మనము ముందుకు వెళ్లాలని తెలిపారు. రేపటి భవిష్యత్తుకు బంగారబాటకు ఈ సన్మాన సభ శ్రీకారం చుడుతుందని తెలిపారు. మన చేనేత కులాల వివిధ సమస్యలను పోరాడే అవకాశం కందికుంట ప్రసాదు ద్వారా తప్పక నెరవేరుతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.