Monday, February 10, 2025
Homeజాతీయంజేఈఈ మెయిన్‌ పరీక్షలు ప్రారంభం

జేఈఈ మెయిన్‌ పరీక్షలు ప్రారంభం

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1 నిర్వహిస్తారు. చివరి రోజు 30న బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌-2 జరుగుతుంది. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరవుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు