Saturday, December 21, 2024
Homeఆంధ్రప్రదేశ్జెస్సీరాజ్ ఏపీకి గర్వకారణం: చంద్రబాబు

జెస్సీరాజ్ ఏపీకి గర్వకారణం: చంద్రబాబు

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ ను ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ – 2025ః వరించింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. 14 ఏళ్ల జెస్సీరాజ్ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి ఎంపికైన జెస్సీరాజ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ అవార్డుకు ఎంపికైన స్కేటర్ జెస్సీరాజ్ కు అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన విజయాలు ఏపీకి గర్వకారణమని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకోబోతున్నారని తెలిపారు. 9 ఏళ్ల వయసులో ఆమె స్కేటింగ్ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిందని… ఆమె పట్టుదల, అంకితభావం ఆమెను ఈరోజు గొప్ప గౌరవాన్ని అందుకునే స్థాయికి తీసుకొచ్చిందని కొనియాడారు. ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆమె ఒక స్ఫూర్తి అని చెప్పారు. ఇటీవల జరిగిన 62వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్స్ లో సోలో డ్యాన్స్ లో ఆమె సిల్వర్ మెడల్ సాధించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు