- Advertisement -
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :- జిల్లాలో ఎటువంటి గ్యాస్ సిలిండర్‌ల కొరత లేదని, గ్యాస్ సరఫరా కు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే 1967 నంబర్‌కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.జిల్లాలో ఎల్పీజీ సిలిండర్లు సక్రమంగా సరఫరా అయ్యేలా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఒక టాస్క్ ఫోర్స్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశామని, హోటళ్లలో అనధికారికంగా వాడుతున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ వివరించారు


