ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి కేశవరెడ్డి
విశాలాంధ్ర- అనంతపురం : ఉపాధి హామీ చట్టంలో పనిచేసే సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి శశిభూషణ కుమార్ కు మంగళవారం వినతి పత్రం అందజేసినట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి కేశవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పెండింగ్ లో ఉన్న గత 10 వారాల ఉపాది కూలీల 50 కోట్లు బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. అనంతపురం జిల్లాలలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉపాధి కూలీలు పనిచేసే చోట నీడ సౌకర్యం కల్పించి మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలని అదే విధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ ఉపాధి హామీ పథకంలో రాజకీయ జోక్యాన్ని ముఖ్యంగా అధికారపార్టీ నాయకుల ప్రమేయం నివారించాలన్నారు. ఇప్పటికి గ్రామాల వదలి వలస వెల్లిన వారిని తిరిగి గ్రామాలకు రప్పించి ఉపాధి పనులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి 200 రోజులు పనిదినాలు కల్పించి రోజుకు వేతనం 700 రూపాయలు ఇవ్వాలన్నారు. శింగనమల మండలంలో టిఎగా పనిచేస్తున్న నారాయణస్వామి వెంటనే సస్పెండ్ చేయాలిని కోరడం జరిగిందన్నారు.