విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని పేట బసవన్న కట్ట వీధిలో గల శ్రీ త్రిలింగేశ్వర దేవాలయంలో సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి, జూనియర్ సివిల్ జడ్జ్ రమ్య సాయి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవ శర్మ జడ్జిలకు ఘన స్వాగతం పలుకుతూ వారి పేరిటన ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను జడ్జిలకు అందజేశారు. అతి పురాతమైన ఈ దేవాలయం యొక్క విశేషాలను అర్చకులు జడ్జీలకు తెలియజేశారు.
త్రీ లింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న జడ్జీలు
RELATED ARTICLES