Thursday, April 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు కే.హెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎంపిక

ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు కే.హెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎంపిక

విశాలాంధ్ర -ధర్మవరం : ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ధర్మవరం పట్టణంలోని కే.హెచ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు చెందిన యస్.షమీమ్ ( బి.ఏ ) ప్రథమ సంవత్సరం ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ బి.ఆనంద్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీ నిర్వహించినటువంటి ఎంపికలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక అయింది అని తెలిపారు. ఎంపికైన ఈ విద్యార్థిని తమిళనాడు అలగప్ప యూనివర్సిటీ లో ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభమయ్యేటువంటి అల్ ఇండియా పోటీలకు ఎస్కే యూనివర్సిటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు అని తెలిపారు.విద్యార్థిని యస్.షమీమ్ కు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు అందరూ కలిసి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు