ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీలలో(రెండు రోజులపాటు) నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ బృందం పర్యటించనున్నది అని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ న్యాక్ ప్రమాణాలతో కళాశాల అభివృద్ధిని , సంస్థాగత విలువల్ని పర్యవేక్షించి అవసరమైన పురోగతిని సూచించ నున్నారు అని తెలిపారు. కళాశాలలో వున్న మౌలిక వసతులు, బోధన, పరిశోధన వంటి అంశాలతో పాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు , పూర్వ విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు అని తెలిపారు. సూచనలు చేయబోతున్న సందర్భంగా కళాశాలలో విద్య పూర్తీ చేసుకుని వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు , ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు , వారి తల్లితండ్రులు కళాశాలకు ఈనెల 8వతేది మధ్యాహ్నం హాజరు కావాలని తెలపడం జరిగిందన్నారు. ఈ కలయిక వల్ల కళాశాల అభివృద్ధికి దోహదపడటమే కాక విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభించేందుకు న్యాక్ గ్రేడ్ తోడ్పడుతుందని వారు తెలిపారు.
కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ బృంద పర్యటన
RELATED ARTICLES