డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జాతీయ పురస్కారం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణానికి చెందిన రజిని ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ వ్యవస్థాపకులు అయినా కన్నా వెంకటేష్ కు విజయవాడ సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియం లో జన సేవా సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 134జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల్లో నిస్వార్థంగా సమాజానికి సేవలు అందిస్తున్న సేవకులను గుర్తించి, అవార్డులతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్రమంత్రి విజయవాడ ఎమ్మెల్యే సుజనాచౌదరి, మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసులు చేతుల మీదుగా జాతీయ ఉత్తమ సేవారత్న పురస్కారం అందుకోవడం జరిగింది. అనంతరం కన్నా వెంకటేష్ మాట్లాడుతూ అవకాశం కి ఎంపిక చేసినందుకు ఆదిశేషుకు, జన సేవా సొసైటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క జాతీయ పురస్కారం మరింత బాధ్యత పెరిగిందని, రజనీ ట్రస్టు, రక్త బంధం ట్రస్టు సభ్యులందరికీ అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
జాతీయ పురస్కారం అందుకున్న రజిని ట్రస్ట్ & రక్త బంధం ట్రస్ట్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్
RELATED ARTICLES