సీనియర్ కరాటే మాస్టర్ అక్బర్ అలీ, సీనియర్ బ్లాక్బెల్టర్ నవ్య
విశాలాంధ్ర ధర్మవరం:: సమాజంలో నేడు జరుగుతున్న చెడును ఎదుర్కోవాలంటే ప్రతి విద్యార్థి కరాటేను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కదిరి సీనియర్ కరాటే మాస్టర్ అక్బర్ అలీ, సీనియర్ బ్లాక్ బెల్ట్ జి. నవ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల పాఠశాలలో మల్టీ స్టార్ ఆల్ ఇండియా బుడోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ ఇనాయత్ భాష బెల్ట్ గ్రేడింగ్ టెస్టులను నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కదిరి సీనియర్ కరాటే మాస్టర్ అక్బర్ అలీ, సీనియర్ బ్లాక్ బెల్ట్ జి నవ్య ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. తల్లిదండ్రులు కూడా బాలికలకు చదువుతోపాటు కరాటేను కూడా నేర్పించాల్సిన అవసరం నేటి కాలంలో, నేటి సమాజంలో ఉంది అని తెలిపారు. వచ్చే వేసవికాలం నుంచి బాలికలకు సెల్ఫ్ ప్రొడక్షన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. తదుపరి కరాటేలో ప్రతిభ చూపిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పల్ బ్రౌన్ బిల్డర్స్ తో పాటు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కరాటే మీద ఆసక్తి గలవారు కరాటే అండ్ జూడో క్లాసెస్ ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 7;45 నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9676467810 ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు.
సమాజంలో చెడును ఎదుర్కోవాలంటే కరాటే తప్పనిసరి అవసరం..
RELATED ARTICLES