బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని, కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రికి వెళ్లారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే ఆయన ఇంటికి చేరుకోనున్నారు. మరోవైపు కేసీఆర్ చాలా రోజుల తర్వాత నిన్న బహిరంగంగా కనిపించారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ… తెలంగాణకు ఎప్పటికీ రక్షణ కవచం బీఆర్ఎస్సేనని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బంపర్ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతోందని… ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని… అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
RELATED ARTICLES