Wednesday, January 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిటిసిపిసి కేంద్రంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

టిసిపిసి కేంద్రంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర అనంతపురం : అనంతపురం నగరంలోని బళ్లారి రోడ్ లో మంగళవారం విభిన్న ప్రతిభావంతుల శాఖ పరిధిలో ఉన్న శిక్షణ మరియు ఉత్పత్తి కేంద్రంను (టిసిపిసి ) జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. టిసిపిసి కేంద్రంలో ఉన్న పరిసరాలను మరియు మూడు చక్రాల వాహనాల తయారీ కేంద్రాన్ని, స్టోర్ గదులను మరియు శిక్షణ తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే వాడుకలో ఉన్న వస్తువులను ఒక చోట, వాడుకలో లేని వస్తువులను ఒకచోట భద్ర పరచాలని సూచించారు. భవనము రీపేరి పనులను చేయించాలని, వాటి ప్రతిపాదనలను తయారుచేసి పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయక సంచాలకులు రాజ్ వినోద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.l

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు