Monday, April 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపరిటాల కుటుంబం పై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో...

పరిటాల కుటుంబం పై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో…

ప్రకాశ్ రెడ్డి పై టిడిపి వాల్మీకి సంఘం నాయకుల ధ్వజం
విశాలాంధ్ర -ధర్మవరం;; పరిటాల కుటుంబం పై మాట్లాడేటప్పుడు ప్రకాష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో లేదా చర్యలు తప్పవు అని టిడిపి వాల్మీకి సంఘం నాయకులు ప్రకాష్ రెడ్డి పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు గాంధీనగర్ టిడిపి కార్యాలయంలో వాల్మీకి సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బొట్టు కృష్ణ, నాయకులు పూజా మొబైల్ సాయి, జంగం నరసింహులు, చిన్న వీరప్ప, జింకల రాజన్న, లింగప్ప, విశ్వ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షని ప్రోత్సహించి కులాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి నీదేనని, గ్రామాలన్నీ ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునేది పరిటాల కుటుంబమే నని వారు స్పష్టం చేశారు. రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి లో పది రోజుల క్రితం జరిగిన చిన్న గొడవ మధ్య కురువ లింగమయ్య చనిపోతే దానికి ఫ్యాక్షను అంటగడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టడం ఏమిటని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిటాల శ్రీరాముపై గాని, వారి కుటుంబముపై గాని ఆరోపణలు చేస్తే సహించేది లేదని వారు తీవ్రంగా హెచ్చరించారు. 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పార్టీతో పాటు కార్యకర్తల కష్టకాలంలో ఉన్నప్పుడు ఏకతాటిపై తెచ్చిన వ్యక్తి పరిటాల శ్రీరామ్ అని వారు గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో బీసీ వ్యక్తికి పార్టీ టికెట్ కేటాయిస్తే పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు సత్య కుమార్ యాదవ్ గెలుపు కోసం కృషి చేయడానికి వారు గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో నీవు ఓడిపోయిన తర్వాత మూడేళ్ల పాటు మీ కార్యకర్తలను గూర్చి గాలికి వదిలేసి బెంగళూరుకు లో తలదాచుకోవడం ఏమంటారు అని ప్రకాష్ రెడ్డిని ప్రశ్నించారు. పరిటాల కుటుంబం టిడిపిలో ఉన్నప్పుడు పార్టీ ఓడిన గెలిచిన కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటూ వారి సమస్యలపై పోరాడుతుంది అని తెలిపారు. ఇకనైనా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. కుల రాజకీయాలు మానుకోవాలని లేదంటే బీసీలే తరిమికొట్టే సమయం ఆసన్నమైనదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు