Wednesday, April 2, 2025
Homeజాతీయంకేంద్రం కీలక నిర్ణయం… ఇకపై ఎంపీల జీతాలు రూ.1 లక్ష నుంచి రూ.1.24 లక్షలకు పెంపు…!

కేంద్రం కీలక నిర్ణయం… ఇకపై ఎంపీల జీతాలు రూ.1 లక్ష నుంచి రూ.1.24 లక్షలకు పెంపు…!

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎంపీల జీతాలు, అలవెన్సులు, పింఛన్లను సవరించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన వేతనాలు, అలవెన్సులు 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం… లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల జీతం నెలకు రూ.1 లక్ష నుంచి రూ.1.24 లక్షలకు పెరిగింది. అలాగే, రోజువారీ భత్యం రూ.2,000 నుంచి రూ.2,500కు పెంచారు. అంతేకాకుండా, మాజీ ఎంపీల పింఛన్‌ను నెలకు రూ.25,000 నుండి రూ.31,000కు పెంచారు. ఐదేళ్ల సర్వీసు తర్వాత ప్రతి సంవత్సరం అదనపు పింఛన్‌ను రూ.2,000 నుండి రూ.2,500కు పెంచినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఎంపీల జీతాలు, అలవెన్సులు, పింఛన్ల పెంపు ప్రకటన వెలువడటం గమనార్హం. ఇంతకు ముందు 2018 ఏప్రిల్‌లో సిట్టింగ్, మాజీ ఎంపీలకు చెల్లించే జీతం మరియు అలవెన్సులను సవరించారు. ఆ సమయంలో ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఎంపీల మూల వేతనాన్ని నెలకు రూ. 1,00,000గా నిర్ణయించారు.

2018 సవరణ ప్రకారం, వేతనాలకు అదనంగా…. ఎంపీలు తమ కార్యాలయ నిర్వహణ, ఓటర్లతో సంబంధాలు కొనసాగించడానికి నియోజకవర్గ భత్యంగా రూ. 70,000 పొందుతున్నారు. దీనితోపాటు, నెలకు కార్యాలయ భత్యంగా రూ. 60,000, పార్లమెంటరీ సమావేశాల సమయంలో రోజువారీ భత్యంగా రూ. 2,000 అందుకుంటున్నారు. ఈ అలవెన్సులు కూడా ఇప్పుడు పెరగనున్నాయి.

వీటితో పాటు, ఎంపీలకు ఫోన్ మరియు ఇంటర్నెట్ వినియోగం కోసం వార్షిక భత్యం కూడా లభిస్తుంది. వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంవత్సరానికి 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు, వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఉపయోగం కోసం ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం చేయవచ్చు. రోడ్డు మార్గం గుండా వెళితే మైలేజ్ అలవెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంపీలు సంవత్సరానికి 50,000 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు 4,000 కిలో లీటర్ల నీటిని కూడా పొందుతారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు