భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చరిత్రలోనే తొలిసారి ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగా మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు. తాలిబన్లతో తాను మాట్లాడిన విషయాన్ని మంత్రి జైశంకర్ ఃఎక్స్ః (గతంలో ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. కాగా, తాలిబన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వస్థాయిలో చర్చలు జరగడం ఇదే తొలిసారి.
కీలక పరిణామం.. తాలిబన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ చర్చలు
RELATED ARTICLES