విశాలాంధ్ర ధర్మవరం; సౌత్ జోన్ హాకీ పోటీలకు ధర్మవరం పట్టణంలోని కే.హెచ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు చెందిన డి. లోకేష్ ( బి.కాం) ద్వితియ సంవత్సరం యస్. ఓంశేఖర్ ( బి.ఏ ) ద్వితియ సంవత్సరం పి. నాగరాజు ( బి.కాం) తృతియ సంవత్సరం ఏ. బాల ఓబిలేసు ( బి.ఏ ) ప్రథమ సంవత్సరం ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.కే.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత నెలలో 10తేదీలలో ఎస్కే యూనివర్సిటీ నిర్వహించినటువంటి సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక కావడం జరిగింది అన్నారు. అదే టోర్నమెంట్ లో కళాశాల ఇంటర్ కాలేజీయేట్టోర్నమెంట్ లో రన్నారప్ గా రావడం జరిగిందన్నారు. ఎంపికైన ఈ విద్యార్థులు తమిళనాడు లోని యూనివర్సిటీ అఫ్ మద్రాస్ లో ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభమయ్యేటువంటి సౌత్ జోన్ హాకీ పోటీలకు ఎస్కే యూనివర్సిటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డా . కే ప్రభాకర్ రెడ్డి , ఫిజికల్ డైరెక్టర్ బి.ఆనంద్ , తదితర ఆద్యాపక , ఆద్యాపకేతర సిబ్బంది అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
సౌత్ జోన్ హాకీ పోటీలకు కే.హెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపిక
RELATED ARTICLES