Saturday, April 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు కియా కారు కంపెనీ ఆర్థిక సహాయం

ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు కియా కారు కంపెనీ ఆర్థిక సహాయం

విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని నడిబొడ్డున గల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గత 60 సంవత్సరాలుగా ఎంతో గుర్తింపు పొందింది. ఈ కళాశాలలో ఎంతోమంది పూర్వ విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలలోను, రాజకీయాలలోనూ, మంత్రులుగా, ప్రభుత్వ ఉన్నత అధికారులుగా ఉన్నారు. అటువంటి ఈ కళాశాలను కొంతవరకు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోని అభివృద్ధి దిశలో ఉండేందుకు కృషి చేశాయి. కానీ మరింత ఆహ్లాదకరమైన వాతావరణంలో కళాశాలను అభివృద్ధి పరిచేందుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి తనదైన శైలిలో పెనుకొండ మండలంలో గల కియా కారు కంపెనీ యాజమాన్యంతో మా కళాశాలకు ఆర్థిక సహాయం అందించాలని వారు కోరడం జరిగింది. తదుపరి కొన్ని రోజుల తర్వాత కియా యాజమాన్యం అధికారులు ధర్మారంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు రావడం, ప్రతిపాదనలు పంపడం జరిగింది. దీంతో కళాశాలకు 7 లక్షల రూపాయలను కియా కంపెనీ సిఎస్ఆర్ క్రింద నిధులు మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వ కళాశాల రూపురేఖలే మారనున్నాయి. కొన్ని రోజులుగా కళాశాలలోని అన్ని భవనాలకు పెయింటింగ్ వర్క్స్ను మొదలుపెట్టారు. తదుపరి గదులకు అవసరమైన విద్యుత్ వైరింగులు, ఫ్యానులు తదితర వాటిని కూడా చేపట్టనున్నారు. సామాజిక భద్రత కింద ఈ పనులు చేపట్టడం జరిగిందని కియా కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ ఈ కళాశాలను మరింత అభివృద్ధి దిశలో నడిపేందుకు తన వంతుగా కియా కంపెనీ తో పాటు మరొక కంపెనీని కూడా కళాశాల పరిస్థితులను తెలపడం జరిగిందన్నారు. నా వినతి మేరకు కియా కంపెనీ 7 లక్షల రూపాయలతో కళాశాల గదుల రూపురేఖలను మార్చడం మాకెంతో సంతోషంగా ఉందని తెలుపుతూ, కియా కంపెనీ యాజమాన్యం కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పాత గదులకే పరిమితమైన ఈ కళాశాల నేడు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు