విశాలాంధ్ర- వలేటివారిపాలెం : యుక్త వయసులో ఉన్న బాలికలు, మహిళల ఉజ్వల భవిష్యత్తు కు కిషోరి వికాసంకార్యక్రమం ఎంతో దోహద పడుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు.శుక్రవారం వలేటివారిపాలెం మండలం లో సీడీపీఓ శర్మిష్ట సూచనల మేరకు సూపెర్వైజర్ సునీత అధ్యక్షతన పోకూరు గ్రామం లో 11to 18 ఇయర్స్ బాలికలకు కిశోరి వికాసం సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ లో విద్య మరియు ఓపెన్ స్కూలింగ్ ప్రాముఖ్యత గురించి వ్యక్తిగత మరియు సామాజిక ఎదుగుదలకు విద్య ప్రాదమిఖమైనదని, విద్య స్థిరమైన మరియు సంతోషకరమైన జీవితానికి దోహదపడుతుంది అని అన్నారు. ప్రపంచం లోనే అతి పెద్ద విద్యా వ్యవస్థలలో ఒకటైన భారతదేశ విద్యా వ్యవస్థ 10+2పద్ధతిని అనుసరిస్తుందని, విద్యా సంస్థలలో నమోదు అయ్యే వారి సంఖ్య లో ఘననీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ బడి మానేసే వారి సంఖ్య, డ్రాపౌట్స్ కూడా ఎక్కువ గా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా మాధ్యమిక స్థాయిలో విద్యా ర్థులను బడి లో ఉంచడానికి నిరంతర ప్రయత్నాల ఆవశ్యకత గురించి తెలియచేశారు. ఈ కార్యక్రమం నకు అంగన్వాడీ కార్యకర్త సరస్వతి, ఆయాలు నయోమి, శ్యామల, ఆశ పాల్గొన్నారు