Friday, May 16, 2025
Homeజిల్లాలునెల్లూరుఅత్తంటివారిపాలెం లో కిశోరి వికాసం సమ్మర్ క్యాంపు

అత్తంటివారిపాలెం లో కిశోరి వికాసం సమ్మర్ క్యాంపు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని అత్తింటివారి పాలెం అంగన్వాడి సెంటర్ లో సి డి పి ఓ శర్మిష్ట సూచనల మేరకు కిశోరి వికాసం సమ్మర్ క్యాంప్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ సునీత హాజరైనారు ఈ కార్యక్రమంలో భాగంగా 11 నుండి 18 సంవత్సరం ల బాలికలకు ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా సంకేతాలు మరియు లక్షణాలు మరియు అనుసరించాల్సిన నివారణ చర్యల గురించి అవగాహన కల్పించటం జరిగినది. ఈ కార్యక్రమమునకు సూపర్వైజర్ సునీత,అంగన్వాడీ కార్యకర్త రాధ,ఆయా ప్రసన్న,ఆశా వరలక్ష్మి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు