సాధనతో అద్భుతాలు సృష్టించవచ్చు
కరస్పాండెంట్ ఏ రమేష్
విశాలాంధ్ర,కదిరి : ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఫలితాల్లో కె యల్ ఎన్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు కరస్పాండెంట్ ఎ.రమేష్ తెలిపారు. పట్టణంలో బండారు నగర్ లో ని కె.యల్.ఎన్ కోచింగ్ సెంటర్ నుండి 148 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 126 మంది క్వాలిఫై అవుతూ ఆల్ ఇండియా ర్యాంక్ లతో విజయదుందివి మోగించార
న్నారు.విద్యార్థులలో నిరంతర శ్రమ నేర్చుకోవాలని తపన ఉంటే పోటీ పరీక్షల్లో కచ్చితంగా సీట్లు సాధించవ
చ్చున్నారు. విద్యార్థుల అభిరుచులు తెలుసుకుని వారితో నిరంతర సాధనతో అద్భుతాలు సృష్టించవచ్చు
నని ఇందుకు నిదర్శనం ఈ ఫలితాలే అన్నారు.మూడు వందల మార్కులకు సాయి
యస్మిత (257)కార్తికేయ (255) మోక్షిత సాయి కృష్ణ (244) ధీరజ్ శ్రీనివాస్( 241) శ్రీధర్ రెడ్డి( 237) భవిష్య రెడ్డి(226)తో పాటు ఆరాహి, వేద ప్రణవి, తేజశ్రీ, స్కంద, గణేష్, శాన్వికృష్ణ,శరణ్య మంచి ర్యాంకులు సాధించారు.