విశాలాంధ్ర -ధర్మవరం:: మండల పరిధిలోని గరుడంపల్లి దగ్గర చిగిచెర్ల రోడ్డు సమీపంలో కాశీనాయనసేవా ఆశ్రమమునకు ధర్మవరం సుందరయ్య నగర్ 29వ వార్డ్ కౌన్సిలర్ కోటిరెడ్డి సుజాత, భర్త కోటిరెడ్డి బాల్రెడ్డి, కోటిరెడ్డి చరణ్ సింహారెడ్డి కుటుంబం వారు శాశ్వత విరాళముగా రూ.28,500 లను ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. అనంతరం దంపతులు మాట్లాడుతూ ఈ విరాళం అన్నదాతల కింద ఇవ్వడం జరిగిందని, కీర్తిశేషులు కోటిరెడ్డి గంగిరెడ్డి, కీర్తిశేషులు కోటిరెడ్డి శాంతమ్మ జ్ఞాపకార్థం ఈ విరాళం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆశ్రమ అధ్యక్షులు శివారెడ్డి ఉపాధ్యక్షులు శంకర చౌడప్ప లు ఆ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేశారు.
కాశి నాయన సేవ ఆశ్రమమునకు శాశ్వత విరాళం అందించిన కోటిరెడ్డి బాల్రెడ్డి
RELATED ARTICLES