నేడు అమరావతిలో పురస్కార ప్రదానం
విశాలాంధ్ర-(విజయనగరం జిల్లా.రాజాం) : రాజాం నియోజకవర్గ ఉత్తమ ఎన్నికల సహాయ అధికారిగా రాజాం తాసిల్దార్ ఎస్.కృష్ణంరాజు ఎంపికయ్యారు. బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ క్రింద ఈ పురస్కారం వరించింది. ఉత్తమ ఏఆర్ఓగా రాజాం తాహసీల్దార్ ఎస్.కృష్ణంరాజు, ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఆయన ను శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పురస్కారాల ప్రదానం జరుగుతుంది.ఎంపిక పట్ల స్థానిక తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది ఆయనను ప్రత్యేకించి అభినందించారు.