విశాలాంధ్ర ధర్మవరం:: విద్యా అనే శాఖలో – విద్యార్థుల ఆవిష్కరణకు తొలి అడుగు అని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ పరిధిలోని అన్ని పాఠశాలల హెడ్మాస్టర్ లతో లక్ష్య కార్యక్రమం కింద ధర్మవరం మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్యంగా 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించే లక్ష్యంతో రూపుదిద్దుకుంది అని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రధానంగా లింగ సమానత్వం– విద్యార్థినీ విద్యార్థుల మధ్య సమాన అవకాశాలు, గౌరవంపై అవగాహన, సంప్రదాయేతర ఉపాధి అవకాశాలు:; మారుతున్న కాలానికి అనుగుణంగా అందుబాటులో ఉన్న వినూత్న ఉపాధి మార్గాలు, భవిష్యత్తు ప్రణాళిక:; విద్యార్థులు తమ అభిరుచులు, ఆసక్తులను అనుసరించి తమ భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి అనే దానిపై మార్గదర్శనం,
వృత్తి మార్గదర్శనం:; విద్యార్థులకు అందుబాటులో ఉన్న విభిన్న విద్యా, ఉద్యోగ రంగాలపై సమగ్ర అవగాహన, ఆర్థిక సాక్షరత:;పొదుపు, పెట్టుబడులు, డబ్బు నిర్వహణ వంటి అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానం ఉండుట,బీమా పరిజ్ఞానం:; జీవిత, ఆరోగ్య బీమా యొక్క ఆవశ్యకతపై అవగాహన,
ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగడం:; కేవలం ఉద్యోగం పొందే వారిగా కాకుండా, నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి విద్యార్థులను తీర్చిదిద్దడం, పర్యావరణ పరిరక్షణ:; పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులలో చైతన్యం తీసుకురావడం లాంటి అంశాలను చర్చించడం జరిగిందని వారు తెలిపారు.ఈ చర్చల సారాంశంగా, ప్రతి పాఠశాల నుండి 8, 9, 10వ తరగతుల విద్యార్థుల పక్షాన ఒక సుస్థిర ప్రణాళిక రూపొందించి, 10 రోజుల్లోగా కార్యాలయానికి సమర్పించవలసిందిగా ప్రధానోపాధ్యాయులను కోరడం జరిగింది అని తెలిపారు. ఈ ప్రణాళికలు విద్యార్థుల ఆలోచనాత్మకత, సామాజిక బాధ్యత, మరియు భవిష్యత్తుపై వారికున్న దృష్టిని ప్రతిబింబించేలా ఉండాలి అని తెలిపారు.
ఆగస్టు మొదటి వారంలో రెండవ విడత సమావేశం నిర్వహించబడుతుంది అని తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాలలు సమర్పించిన ప్రణాళికలను సమీక్షించి, ఉత్తమమైన వాటిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆపై, ప్రతి పాఠశాలను ఒక మండల స్థాయి అధికారి దత్తత తీసుకుని, 8, 9, 10వ తరగతుల విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ “లక్ష్య” కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, జ్ఞానవృద్ధి, జీవిత నైపుణ్యాలు పెంపొందించాలన్నదే మనందరి ప్రధాన ఆశయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
లక్ష్య పథకం – విద్యార్థుల ఆవిష్కరణకు తొలి అడుగు.. ఎంపీడీవో సాయి మనోహర్
RELATED ARTICLES