Friday, April 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి11 న అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున ధర్నా

11 న అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున ధర్నా

సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవి కుమార్.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 650-2 సర్వే నెంబర్లు జరిగిన అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలుత ఉదయం 9 గంటలకు అందరూ కాలేజీ గ్రౌండ్కు చేరుకోవాలని, అక్కడినుండి వందల సంఖ్యలో బైక్ ర్యాలీగా కళాజ్యోతి సర్కిల్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయము వద్ద చేరుకోవడం జరుగుతుందన్నారు. తదుపరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ కార్మికుల సమస్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్కు, ఆర్డీవోకు, ఎమ్మార్వో కు, మున్సిపల్ కమిషనర్ కు ఇటీవలే వినతి పత్రాలు అందించినా కూడా స్పందన లేకపోవడం దారుణం అన్నారు. అందుకే ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్స్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున ఈ ధర్నా కార్యక్రమం విజయం కొరకు చేనేత కార్మిక సంఘం నాయకులు, చేనేత కార్మికులు, యువజన సంఘం నాయకులు, మహిళా సంఘం కార్మికులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు