విశాలాంధ్ర,కదిరి : ప్రతి ఒక్కరు స్వచ్ఛతను ఒక ఉద్యమ స్పూర్తిగా పని చేద్దామని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డా. హుసేన్, ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్ సులేమాన్ తెలిపారు.ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర దివాస్ లో భాగంగా ఊరూ వాడా స్వచ్ఛతా మార్గంలో పయనించాలని, స్వచ్ఛాంధ్ర- ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందనితెలిపారు.
.ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది చీపురు చేత పట్టి రోడ్డు ఊడ్చారు.ఈ స్ఫూర్తి ఒక్కరోజుతో ఆగిపోకూడదని, స్వచ్చత అనేది మన రోజువారీ జీవితంలో భాగం కావాలని అందరి చేత ప్రతిజ్ఞ చేయిం
చారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు స్వచ్ఛతను ఒక ఉద్యమ స్పూర్తిగా పని చేద్దాం
RELATED ARTICLES