Wednesday, March 12, 2025
Homeజిల్లాలునెల్లూరుపార్టీ పూర్వ వైభవానికి కలిసికట్టుగా కృషి చేద్దాం

పార్టీ పూర్వ వైభవానికి కలిసికట్టుగా కృషి చేద్దాం

మండల కన్వీనర్ అనుమోలు లక్ష్మీ నరసింహం
విశాలాంధ్ర -వలేటివారిపాలెం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కలిసికట్టుగా కృషి చేద్దామని మండల వైసీపీ కన్వీనర్ అనుమోలు లక్ష్మీనరసింహం తెలిపారు మండల కేంద్రమైన వలేటివారిపాలెం వైసీపీ కార్యాలయంలో నూతన మండల కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మీనరసింహ మాట్లాడుతూ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదని చెప్పారు కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా కలిసికట్టుగా పోరాడాలని సూచించారు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం సాధించవచ్చు అని సూచించారు అనంతరం 13 విభాగాలకు సంబంధించి ఒక్కొక్క విభాగానికి 13 మంది చొప్పున కమిటీలను ఏర్పాటు చేశారు అనంతరం కార్యకర్తలు నాయకులు నూతనంగా ఎన్నికైన మండల వైసీపీ కన్వీనర్ అనుములు లక్ష్మీ నరసింహను చాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు చింతలపూడి రవీంద్ర కాకు వెంకటస్వామి నలమోతు చంద్రమౌళి ఇరుపని అంజయ్య, కట్టా హనుమంతురావు,నాగిరెడ్డి శివరామిరెడ్డి గుత్తా గోపి,చుండి ఎంపిటిసి చౌడబోయిన యానాది,అమ్మపాలెం సర్పంచ్ చెన్నెబోయిన ఓబులు కొండయ్య,యాళ్ళ శివకుమార్ రెడ్డి, ప్రగడ రవి, పెయ్యల మల్లికార్జున, అనుమోలు సుబ్బారావు,నవులూరి హాజరత్తయ్య, మద్దాలి రామారావు,దామా రమేష్, ప్రగడ శ్రీనివాసులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు