Friday, May 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం- పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం- పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

మున్సిపల్ కమీషనర్ కె. కిరణ్ కుమార్

విశాలాంధ్ర-కదిరి : ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడుతూ పర్యావరణాన్ని పరిరక్షించు
కుందామని మున్సిపల్ కమీషనర్ కె. కిరణ్ కుమార్ పిలుపు నిచ్చారు.శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్చాంద్ర లో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంలో ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. ప్లాస్టిక్ భూతం మూలంగా ఇప్పటికే పర్యావరణం నాశనమైందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వలన క్యాన్సర్ మహమ్మారి మనిషి ప్రాణాలను హరించడమే కాకుండా పర్యావరణాన్ని మింగేస్తుందని ఇకనైనా ప్రజలు మేల్కొని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదిద్దామని, ప్లాస్టిక్ కవర్లు బదులు క్లాత్ బ్యాగ్ లు వాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆల్ఫా ముస్తఫా, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు