విశాలాంధ్ర ధర్మవరం:: నాటు సారాయిని నిర్మూలిద్దాం-ప్రగతిని సాధిద్దాం అని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కళా జ్యోతి సర్కిల్ వద్ద మానవహారాన్ని నిర్వహించి నాటు సారా ఈ నిర్మూలనపై ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కళాజాత బృందం పాలు పాటల ద్వారా, డాన్సుల ద్వారా నాటు సారా వల్ల కలిగే నష్టాలను వారు వివరించారు. అనంతరం ఎక్సైజ్ సీఐ చంద్రమణి మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ శాఖ సంకల్పం గా ముందుకు వెళుతుందని, నాటు సారాయికి దూరం, ఆరోగ్యానికి మహాభాగ్యం, ఆరోగ్య ఆంధ్రకు మార్గం అని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. సారాయి తాగితే అధోగతి పడుతుందని మానితే పురోగతి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
నాటు సారాయిని నిర్మూలిద్దాం-ప్రగతిని సాధిద్దాం.. ఎక్సైసీఐ చంద్రమణి
RELATED ARTICLES