Homeఅంతర్జాతీయం‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే...

‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే…

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకు మాత్రమే అనే నినాదం వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ సంతతి పౌరులు అమెరికాను విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్రతి పది మంది ఇండియన్‌-అమెరికన్లలో నలుగురు ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో జీవన విధానం, ప్రభుత్వ నిర్ణయాలపై కార్నెగీ ఎండోమెంట్‌ నిర్వహించిన సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఇందులో 40శాతం భారతీయ సంతతి పౌరులు అమెరికాను విడిచిపోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తేలింది.రాజకీయ అస్థిరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని 58 శాతం మంది తెలిపారు.

25శాతం తగ్గిన హెచ్‌-1బీ వీసాలు..
ట్రంప్ రెండో దఫా పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారు 71 శాతంగా నమోదయ్యారు.
2024-25 గణాంకాల ప్రకారం ప్రస్తుతం 54 లక్షలకుపైగా భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో వీరి వాటా 1.5 శాతంగా ఉంది.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలు కఠినతరం అయ్యాయి.
దీని ప్రభావంతో అక్రమ వలసలకంటే చట్టబద్ధ వలసలే ఎక్కువగా తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్నిCato Institute వెల్లడించింది. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసాల జారీ గణనీయంగా పడిపోయినట్లు పేర్కొంది.ట్రంప్ అధికారంలోకి రాకముందే అక్రమ వలసలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రస్తుతం అదే ధోరణి కొనసాగుతోంది.

25శాతం తగ్గిన హెచ్‌-1బీ వీసాలు..
అయితే చట్టబద్ధ వలసలు మాత్రం గణనీయంగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే హెచ్‌-1బీ వీసాల జారీ 25 శాతం తగ్గింది. వీసా దరఖాస్తులపై భారీ రుసుము అమల్లోకి వచ్చిన తర్వాత సంస్థల నుంచి దరఖాస్తులు 87 శాతం తగ్గాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వీసాల సంఖ్య మరింత తగ్గే అవకాశముందని అంచనా. సామాజిక మాధ్యమాల తనిఖీలు వంటి కఠిన నిబంధనల ప్రభావంతో విద్యార్థి వీసాలు కూడా 40 శాతం మేర తగ్గినట్లు సర్వే వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు