: ఏపీ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ అడ్వైజర్ కన్నయ్య నాయుడు
విశాలాంధ్ర- జేఎన్టీయూ ఏ : నీటిబొట్టున ఒడిసి పట్టి రాయలసీమలను సస్యశ్యామలం చేసేందుకు ప్రతి రైతు నడుం బిగించాలని ఏపీ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ అడ్వైజర్ ఎన్ కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. 17వ అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవ దినోత్సవాన్ని , అనంత రాముడు జన్మదినోత్సవాన్ని కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ కె లక్ష్మీనారాయణ, వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య, ఎస్కేయూ రెక్టర్ వెంకట్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఎన్ కన్నయ్య నాయుడు మాట్లాడుతూ.. రాయలసీమలో జీవనది లేకపోయినా.. తుంగభద్ర కెనాల్ తో పంటలు పండించుకున్న మహిళా రైతులు కృతజ్ఞతలు తెలుపుతూ.. వచ్చినందుకు ఆనందం జీవితంలో ఎన్నటికీ మరువలేనిది అన్నారు. నీటి కాలువలను ప్రతి రైతు సంరక్షించుకోవాల్సిన సంరక్షించుకుని.. ప్రభుత్వాలకు మార్గదర్శకంగా దిక్సూచిగా నిలవాలి అన్నారు. కాలువలకు చిన్న రంద్రాలను సమైక్య స్ఫూర్తితో రైతులే సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వ అధికారుల కోసం వేచి ఉండకూడదన్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ స్థాయికి ఎదిగిన అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఆధునిక పోటీ తత్వానికి సాదరంగా ఆహ్వానిస్తూ.. విజయ శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కర్షకుడిగా, విద్యావేత్తగా విజయ శిఖరాలను అనంతరాముడు అధిరోహించారు అన్నారు. ఇంజనీరింగ్ కోర్సు ఫీజు తక్కువతో అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థుల జీవితాలలో వెలుగులను అందించాలని అనంత రాముడును ఆకాంక్షించారు. పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్కులకు తగ్గట్టుగా కళాశాలలు వాటి యొక్క ప్రమాణాలను, విద్యార్థుల సన్నద్ధత, పరిశోదాత్మక, బోధన, ఉజ్వల వికాసానికి , ఉపాధి కల్పనా అందించాలని కోరారు. కళాశాల చైర్మన్ ఏం .అనంత రాముడు మాట్లాడుతూ.. కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి ఆశయం నెరవేరి.. తల్లిదండ్రుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచ్చేందుకు ఎంతటి కష్టనైనా ఎదుర్కొనే ధైర్యం భగవంతుడు ఇచ్చాడన్నారు. అందుకు కావలసిన వనరులను తాను అందించేందుకు నిరంతరం అన్వేషణ, పరిశోధన అధ్యయనం చేస్తూనే ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎం. రమేష్ నాయుడు, నైపుణ్య అభివృద్ధి డైరెక్టర్ ఎం సురేందర్ నాయుడు, ప్రిన్సిపల్ ఎం రామ్మూర్తి , అధ్యాపక బృందం పాల్గొన్నారు. విద్యార్థుల వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.