Saturday, March 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్వర్ణాంధ్ర, స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం

స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం

ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం

డయేరియా, మలేరియా, చికెన్ గునియా, లాంటి రోగాల బారిన పడకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని –

ఈ దేశం, రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. – మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం; పరిశుభ్రతతోనేఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించవచ్చునని రాష్ట్రఆరోగ్యకుటుంబ సంక్షేమవైద్యవిద్యశాఖమంత్రి వై. సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ రైల్వే స్టేషన్ రోడ్డువద్దశనివారం ఉదయం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత స్వచ్ఛతా ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన పార్కులో మంత్రి పలు మొక్కలను నాటారు. అలాగే కార్యక్రమానికి ప్రక్కనే ఉన్న 19వ వార్డు లో మంత్రి పరిసరాల పరిశుభ్రత అవగాహనలో భాగంగా చీపురును చేతపట్టి రోడ్డును ఊడ్చారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, పరిసరాల పరిశుభ్రత వల్ల ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చునని మంత్రి తెలిపారు. ముఖ్యంగా అత్యంత పరిశుభ్రత ప్రాంతంగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ధర్మవరంను తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో అగ్రగామిగా నిలపాలని దృఢ సంకల్పంతో ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అన్నిచర్యలుతీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. 2014 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు మంత్రి గుర్తు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ధర్మవరం ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉందని అందువల్ల ఈ ప్రాంత ప్రజలు సామాజిక బాధ్యతతో ధర్మవరం ను సుందర వనంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల సహకరించాలన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడమే తన ధ్యేయం అని దీనికై రాబోయే రోజుల్లో అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. గత చాలాకాలంగా ఈ పార్క్ ప్రాంతంలో చెత్త పేరుకుపోవడం వల్ల ఈ ప్రాంతాన్ని సుందరీకరణ చేసి నూతన పార్కుగా ఏర్పాటు చేయడం శుభ పరిణామం ఉన్నారు. ప్రస్తుత పార్కులో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలపై విస్తృతంగా ప్రజల్లో చైతన్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పరిసరాల శుభ్రత అంటే ప్రభుత్వం లేదా పారిసుద్ద్య కార్మికుల బాధ్యత అనే ఆలోచనను పక్కకు పెట్టి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్న భావన పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు. డయేరియా, మలేరియా, చికెన్ గునియా తదితర లాంటి రోగాల బారిన పడకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని మంత్రి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేచర్ తదితర అనేక సర్వే సంస్థలు కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణపై హెచ్చరిస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమంతో పాటు విద్యార్థులు పరీక్షల అనంతరం వేసవి సెలవు సమయంలో ప్రతి శనివారం స్వచ్చ ఆంధ్రా – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ దేశం, రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. శుభ్రతను స్వచ్ఛతను మన జీవితంలో ఒక భాగంగా పరిగణించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. పరిశుభ్రతతో పాటు ధర్మవరంలో ప్లాస్టిక్ వాడకం నియంత్రణకు దోహదపడాలన్నారు. రాష్ట్రంలో సుమారు 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ అలాగే సుమారు 57 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించే ప్రయత్నం జరిగిందని మంత్రి తెలిపారు. ధర్మవరంలో గత కొంత కాలంగా సుమారు 57వేల పేరుకుపోయిన చెత్తను తొలగించే క్రమంలో యం ఆర్ ఎఫ్ ప్రాజెక్టు రూ. 2.కోట్ల 50 లక్షలతో డంపింగ్ యార్డ్ వర్మి కంపోస్టు ఏర్పాటు చేశామని తద్వారా వచ్చే ఎరువులను ఇలాంటి పార్కులకు పురపాలక సంఘం ఉపయోగించడం పట్ల మంత్రి అభినందించారు. తదితరకార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 కోట్ల 75 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని తద్వారా అక్కాచెల్లెళ్ల ఆత్మ గౌరవాన్ని పరిరక్షించడం తో పాటు 93 శాతం రక్షించబడినట్లు మంత్రి తెలిపారు. గత పాలకులు ధర్మవరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో అలసత్వం ప్రదర్శించారని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛతను ఒక ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం చెత్త సేకరణ కొరకు ఏర్పాటుచేసిన తోపుడు బండ్లను పురపాలక సంఘం కార్మికులకు అందించే క్రమంలో వాటిని మంత్రి ప్రారంభించారు. అలాగే స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛఆంధ్ర పై అవగాహన ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, కేహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్, అనంతపురం జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు జింక చంద్రశేఖర, రూరల్ అధ్యక్షులు గొట్టలూరు చంద్ర, టిడిపి నాయకులు, కమతం కాటమయ్య, కేసగల్ల శ్రీనివాసులు, సంద రాఘవ, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ, బిజెపి మైనారిటీ నాయకులు నబి రసూల్, కృష్ణాపురం జమీర్, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, బిల్లే శ్రీనివాసులు, బోయ పెద్ద లింగమయ్య బ్రదర్స్, డి. చెర్లోపల్లి నారాయణస్వామి, బిజెపి మహిళా నాయకురాలు కంచం లీలావతి, శారద మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్లు, అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు