విశాలాంధ్ర -తనకల్లు : దృష్టిలోపాన్ని జయించి మన భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని డిపిఎం డాక్టర్ అనురాధ తెలిపారు.మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో దృష్టిలోపం ఉన్న 18 మంది విద్యార్థినిలకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి తో పాటు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ సోమ పాలెం నాగభూషణలు హాజరయ్యారు. కంటి అద్దాల పంపిణీ అనంతరం డాక్టర్ అనురాధ మాట్లాడుతూ ఈ పాఠశాల యందు 253 మంది విద్యార్థులకు పరీక్షలు చేయడం జరిగిందని వారిలో దృష్టి లోపం ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేశామన్నారు. కళ్ళను రక్షించుకోవడం ఎలా ఎలాంటి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి అనే విషయాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ చేయడం సంతోషించదగ్గ విషయమని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల గురించి ఆలోచిస్తారని మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి తెలిపారు.అలాగే ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గురించి విద్యార్థులకు తెలిపి ప్రతిజ్ఞ చేయించారు. మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలో కంటి పరీక్షలు నిర్వహించి అందరికీ అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని డాక్టర్ లోకేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ గణేష్ రెడ్డి డాక్టర్ ధర్మరాజు ఎస్ ఓ హామీదాభి సూపర్వైజర్ సూర్యనారాయణ రెడ్డి హెల్త్ అసిస్టెంట్ ముసల్ రెడ్డి ఎం ఎల్ హెచ్ పి ధనలక్ష్మి ఏఎన్ఎం హసీనా ఆశా కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయిణులు తదితరులు పాల్గొన్నారు.
దృష్టిలోపాన్ని జయిద్దాం – భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం….డాక్టర్ అనురాధ
RELATED ARTICLES